ఎవరి కోసం ఈ నిరీక్షణ కవిరాజా?
నీ జయంతి రోజున “నీ” వారందరూ వచ్చి నీన్ను పుష్పమాలంకృతుడ్ని చేసి, తమ అభిమానాన్ని, ప్రేమని, సంఘానికి నీవు చేసిన సేవని పొగిడి, తమ భుజాలని చరుచుకుని వెడతారంటగా?
౧౫ జనవరి రామస్వామి జయంతి రోజు. మొబైల్‌కి చిరు సందేశం పంపారు. 15 న ఉదయం, ౯ గం॥లకు చిన్న సభ ఆ విగ్రహం దగ్గిరే జరుగుతుంది అని. రామస్వామి కి పూలని కోయడం ఇష్టం ఉండదట. సూతాశ్రమంలో పూల తోట ఉన్నా ఎవరిని పూల ని కోయనిచ్చేవారు కాదంట. రాలీన పూలని ఏరుకోనిచ్చేవారంట. వారి అమ్మాయే చెప్పారు నాతో.
నిన్న సాయంత్రం, భాగ్యనగరం లోని టాంక్ బండ్ మీదకి ఎవరినో మిత్రులని కలుద్దామని వెడుతూ, పనిలో పనిగా ఆ విగ్రహాలని చూద్దామని వెళ్ళాను. ఇలా ఉంది, ఆ విగ్రహం. శోచనీయం. స్థూపం మీద అంటీంచిన ఆ కాగితం చూసారా!
ప్రభుత్వంలోని తత్సంభందిత అధికారులు, కనీసం ఆ పెద్దల జయంతి రోజునో, వర్ధంతి రోజునో ఆ విగ్రహాలని శుభ్రం చేసి, కనీసం ఆటు వెళ్ళే వారికి ఆ రోజుని గుర్తు చెయ్యవచ్చు కదా? భాగ్యనగరంలో ఇన్ని సాంస్కృతిక సంఘాలున్నవి, ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చెయ్యవచ్చు కదా?