2014 లో సెప్టెంబరు నెలలో రెండవ ఆదివారం తేది14 అయ్యింది. ఆ రోజున మధురాంతకం నరేంద్ర గారి కథని వేదిక – సాహితీ సమావేశం సభ్యులు చర్చించుకున్నారు. ఆ కథ ని కధా సాహితి సంపాదకులు తమ కధ 2014 సంకలనంలో చేర్చుకున్నారు. మధురాంతకం నరేంద్ర సాహిత్యం గురించి మరి కొన్ని వివరాలు కథానిలయం లో ఇక్కడ చూడండి.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం వారి చేతుల మీదుగానే అందుకుంటున్న మధురాంతకం నరేంద్ర. వీరిద్దరూ అధ్యాపకులే! తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారిని కూడా ఇందులో చూడవచ్చు.
ఇవి కాక ఆంగ్లంలో The Hans India ఆంగ్ల దిన పత్రికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద నరేంద్ర వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. నరేంద్ర గారి కథలలో కొన్ని; అత్యాచారం (991), నిత్యమూ నిరంతరమూ (1993), అస్తిత్వానికి అటూ – ఇటూ – (2001), నమ్మకం (2008), చిత్రలేఖ (2010), చివరి ఇల్లు (2013) ఇదివరలో కథాసాహితి వారి కధ సంపుటాలలో చోటు చేసుకున్నవి.
ఇందులో చెప్పుకోవలిసిన అంశం ఏమిటంటే 1992 లో కధ 1991ని ఆవిష్కరించింది కీ.శే మధురాంతకం రాజారాం. వారి తనయుడు మధురాంతకం నరేంద్ర.
ఇక కథా సారంగ లో (July 9, 2015) 3456GB వ్రాసిన కొట్టం రామకృష్ణారెడ్డి తొలి కధ – తీర్పు. ఇది 1991 ఫిబ్రవరిలో రచన మాస పత్రికలో వచ్చింది. వీరి కథ కూడ ఈ కథ 2014 సంపుటిలో ఉంది. వివరాలకు సంకలనాన్ని చూడండి.
బంధం కధ 2013 లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురించింది. ఆ కథ వ్రాసింది బోడపాటి హరితాదేవి. కలం పేరు రాధిక. సంపాదకులు ఎన్నుకున్న కధని మీరు కథ 2014 లోనే చూసుకోవాలి మరి. 🙂
2014 అక్టోబరులో రెండవ ఆదివారం 12 వ తేది అయ్యింది. ఆ రోజు సాయంత్రం డా. వి చంద్రశేఖర రావు గారి నవల నల్లమిరియం చెట్టు మీద వేదిక సాహితీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వినిపించారు కన్నెగంటి రామారావు. మరో సాహిత్య పిపాసి 🙂 డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఆ రోజు సాయంత్రం వేదిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ అమెరికాలో ఉంటారు. చెప్పొచ్చేదేమిటంటే యాజి కూడా అమెరికాలోనే ఉంటారు.
కథకుడు యాజి తన కధకు ఎన్నుకున్న అంశం మీద సాహిత్యలోకంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. యాజి కథకూడ కధ 2014 లో చోటుచేసుకుంది. విశేషం ఏమిటంటే యాజి స్వస్థలం తెనాలి. 😎
కధ 2014 – కధాసంపుటిలోని ఒక ముగ్గురు కథకులను గురించి, ఇక్కడేమో మరో ముగ్గురు కధకులు గురించి తెలియచేసాను. రేపు … ఆ మిగతా కథకుల గురించి. 😎 అన్నట్టు తెనాలి కి వస్తున్నారుగా! తెనాలి లో కవిరాజు ఉద్యావనం (పార్క్) ఇక్కడుంది.
రెండు దశాబ్దాలు
కథ 1990 – 2009
౩౦ కధలతో రెండు దశాబ్దాల ఉత్తమ కధల సంకలనం
ప్రతులకు
164, Ravi Colony, Tirumalagherry, Secunderabad 500 015, India Ph: +91 2779 7691
ధర: రూ 150.00 / US $ 25.00
పోస్ట్ / కొరియర్ ఖర్చులు అదనం.
One Reply to “కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు”