జీమెయిల్ లో మీ సంతకం

గూగుల్ వారి జీమెయిల్ లో ఖాతా లేకపోతే ఒక ఖాతా ఏర్పాటు చేసుకోండి.

గూగుల్ మెయిల్ లోకి ప్రవేశించిన తరువాత తెరమీద మీకు కుడి వైపు, పైన లాబ్స్

కనబడుతుంది.  ఇది లాబ్స్ చిహ్నం

గూగుల్ లాబ్స్

లాబ్స్ సచేతనం (enable) గా ఉంటే ఆకుపచ్చిని రంగులో కనపడుతుంది.  అచేతనంగా ఉంటే  దాని మీద క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు లాబ్స్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది.

అందులో మీ సంతకాన్ని ఫార్మాట్ చేసుకోవడనికి ముందు రెండు పనులు చెయ్యాలి.

ఒకటి:  Insert images ని చేతనం (enable) చెయ్యండి.

రెండు: Canned responses ని కూడ సచేతనం చెయ్యాలి.  లాబ్స్ పేజిలో దిగువన ఈ అమరికలను (Settings) ని భధ్ర పరుచుకోవాలి (సేవ్).

ఇప్పుడు మీరు జీమైల్ పేజ్‌లోకి ప్రవేశిస్తారు.

ఇప్పుడు ఎడమ చేతివైపు న ఉన్న “కంపోజ్ మైల్” (Compose Mail) ని క్లిక్ చెయ్యండి.

అక్కడ ఇందాక మీరు లాబ్స్ లో ఎంచుకున్న రెండు అమరికలు కనపడుతాయి. చిత్రం చూడండి.

ఇక ఇప్పుడు మీ సంతకానికి కావల్సిన సొబగులు ఎలా అద్దాలో చూద్దాం.

అక్షరాలు / Text

మీ మైల్ కంపోజ్ బాక్స్‌లో మీకు కావల్సిన వివరాలను టైప్ చెయ్యండి. పైన కనపడుతున్న మిగతా ఉపకరణాలను వాడి, అక్షరాలను మీరు కోరుకున్న విధంగా, రంగులు కూడా అద్దుకుని ఫార్మట్ చేసుకోండి.

బొమ్మ / Picture

ఉదాహరణకి ఈ తెరపట్టు( Screen shot)

జీ మైల్ సంతకం

పైన్ బొమ్మలో బాణం గుర్తు చూపిస్తున్న చిహ్నాన్ని క్లిక్ చేస్తే,మీ కంప్యుటర్‌‌లో ఉన్న బొమ్మని మీరు మీ సంతకానికి అనుసంధానించగలరు.

ఒక బొమ్మని మీ సంతకానికి ఇలా కలపవచ్చు.

అప్పుడు మీ సంతకం మీరు కోరుకున్న విధంగా ఒక చక్కని బొమ్మతో సహా ఏర్పాటు చేసుకున్న వారవుతారు. మీ సంతకం ఇప్పుడు ఇలా కనపడుతుంది.

ఉదా:

పైన బాణం గుర్తులో చూపిన విధంగా కాన్డ్ రెస్పాన్స్‌ (Canned Responses) మీద క్లిక్ చేసి సెవ్ చేసుకోవాలి.

మీ సంతకానికి తగిన పేరుతో, కాన్డ్ రెస్పాన్స్‌లో భద్ర (సేవ్) పరుచుకోవాలి.

ఇక ఇప్పుడు మీరు మీ జీమైల్ నుంచి పంపే ప్రతి మైల్ తో మీ సంతకంని కాన్డ్ రెస్పాన్సెని నుండి ఎన్నుకుని పంపాలి.

సూచన: ఈ టపాలోని బొమ్మల మీద క్లిక్ చేస్తే అవి పెద్దవిగా కనపడతాయి.

ఫైర్‌ఫాక్స్ లో తెలుగులో టైప్ చెయ్యడానికి ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్‌టెన్షన్

ఫైర్‌ఫాక్స్ (Firefox) ని మరింత శక్తిమంతమైన విహరిణిని (browser) చేసేవి,  దానికి వాడే ప్లగ్‌ఇన్ / ఆడ్ఆన్ లు /  ఎక్స్‌టెన్షన్‌లు (Plug-ins, Add-on, extensions). తెలుగులో వీటిని ఉపకరణములు అని పిలుచుకోవచ్చు.  ఈ ఉపకరణాలలో తెలుగు భాషలో టైప్ చేయ్యాలనుకునే వారికి ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ అతి ముఖ్యమైనది. తెలుగు పదాన్ని ఇంగ్లిష్ భాషలో టైప్ చేస్తే,  ఈ ఉపకరణం మీ విహరిణి లో తెలుగు పదాలను చూపిస్తుంది.

హాట్‌మైల్, జీమైల్, యహూ మైల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆర్కుట్ మొదలైన సోషల్ మెడియాలలో తెలుగు ని అంగ్లంలో బదులు, మన తెలుగు భాషలోనే టైపు చేసుకోవడం ఎలా అన్నది ఈ టపా ఉద్దేశం.  తెలుగులో టైప్ చేసుకోవడానికి చాల పద్ధతులున్నవి.  వాటిలో ఇది ఒకటి.

ఉదాహరణ: నా పేరు: అనిల్. దీనికి ఇంగ్లిష్ స్పెల్లింగ్ Anil.  ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ (Indic Input Extension) అనే అడ్‌ఆన్‌ని స్థాపించుకుని (install) ఇంగ్లిష్ లో Anil అని టైప్ చేస్తే అది అనిల్ అని తెలుగులో చూపిస్తుంది.

మరొక ఉదహరణరాముడు మంచి బాలుడు అని మీరు తెలుగులో టైప్ చెయ్యాలనుకుంటే Raamudu maMci baaludu అని ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే అది తెలుగులో రాముడు మంచి బాలుడు గా మార్చి చూపిస్తుంది.

దీనికి మీరు చేయ్యవలసినవి:
మొదటి సోపానం (First step)     మంట నక్క (Firefox) విహరిణి (browser) నిMozialla Firefox Browser - మంటనక్క విహరిణి

ఇక్కడ నుండి దిగుమతి (download) చేసుకుని మీ కంప్యూటర్ మీద స్థాపించుకోండి.

రెండవ సోపానం (Second step) మీ మంటనక్క విహరిణి ని డబల్ క్లిక్ చేసి మొదలుబెట్టండి.  ప్రసాద్ సుంకరి గారి  ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ ని ఇక్కడ నుండి దిగుమతి (download) చేసుకోవాలి.

Prasad Sunkari's Indic Input Extension. You can choose from any one of the 26 options.

మూడవ సోపానం (Third step)ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ (Indic Input Extension) ఇన్‌స్టల్ చేసిన తరువాత మళ్ళీ మంటనక్క ని మొదలు పెడుతుంది.  ఇప్పుడు మీ విహరిణి లో క్రింద నున్న స్టేటస్ బార్ మీద కుడి చేతి వైపు మీకు ఒక చిన్న భారత దేశ పతాక చిహ్నం కనపడుతుంది.  దానిమీద మళ్ళీ క్లిక్ చెయ్యండి.  భారత దేశ భాషలు కొన్ని కనబడుతాయి.

ఆ ఆప్షన్స్ లో (options) తెలుగు – RTS ని ఎన్నుకోండి.

ప్రసాద్ సుంకరి గారి ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్ టెన్సన్ (Indic Input Extension)

ఇక మీరు తెలుగులో టపాయించడానికి తయారైనట్టే!
మొదలు బెట్టండి ఇక తెలుగులో టైప్ చెయ్యడం.