అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు

కొడవటిగంటి కుటుంబరావు, ఆరుద్ర, ఓల్గా గార్ల ముందు మాటలతో వెలువడుతున్న 26 కథలు.
KodavaTigaMTi kuTuMbarao కొడవటిగంటి కుటుంబరావు
కొడవటిగంటి కుటుంబరావు
Arudra
ఆరుద్ర (భాగవతుల శివశంకర శాస్త్రి)
Volga - Popuri Lalitakumari
ఓల్గా - పోపూరి లలితకుమారి

“మహా సముద్రం లాంటి సినిమారంగంలో కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న పిచ్చేశ్వరరావు మూడు నాలు దశాబ్దాలలో జరిగిన  అంతర్జాతీయ సంఘటనలతో ప్రభావితుడై కథలు రాశాడు.

కళాకారుడికి శిల్పంలో పొదుపు అత్యవసరం.  ఈ పొదుపుకు ఆదర్శప్రాయమనదగినది ‘నెత్తురు కథ.’  అయిదు పేజీలు పూర్తిగా లేని ఈ కథలో ఒక జీవితమే కాదు, ఎంతో చరిత్ర లిఖించి ఉన్నది.”  – కొడవటిగంటి కుటుంబరావు

“అట్లూరి పిచ్చేశ్వరరావు నాకు మిత్రుడు.  అయనా నేను కొన్ని చిత్రాలకు కలిసి పనిచేశాం.  అతడు మాటలు రాస్తే నేను పాటలు రాశాను. ఆ చిత్రాలలో ‘చివరకు మిగిలేది‘ చెప్పుకోతగ్గది. ‘తెలుగు కథానిక సాహిత్యంలో సాయుధ దళాల ఇతివృత్తాలు’ అనే అంశాన్ని ఎవరైనా స్వీకరిస్తే బాగుంటుంది.  పిచ్చేశ్వరరావు నేవి కథలకు న్యాయం చేకూరుతుంది.  పిచ్చేశ్వరరావు రచించిన ‘చిరంజీవి‘ కథ మన తెలుగు  కథానిక సాహిత్యంలో చిరంజీవే. ”  – ఆరుద్ర

“పిచ్చేశ్వరరావుగారు కథలు రాయడం కొనసాగించి ఉంటే తెలుగు సాహిత్యానికి ఒక మార్కెజ్ మిగిలేవాడు.  ఆయన శైలి, భాష, ప్రస్తావించే వివిధ జాతీయ అంతర్జాతీయ సాహితీ రాజకీయ అంశాలు ఇవి మన తెలుగు రచయితల్లో అతి తక్కువ మందిలో కనపడతాయి… చరిత్రను మన ముందు తివాచీలా పరిచిన కథలు. ఈ తరం కథకులకు కథలెలా రాయాలో నేర్పే పాఠాలు ఈ కథలు.” ఓల్గా

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు - పుస్తకం ఆవిష్కరణ వివరాలు తెలుసుకోవడానికి క్రింద మీ వివరాలు తెలియజేయండి.