మునగ చెట్టు

మునగచెట్టు

చూసాను.
చాలామందిని చూసాను.
అతి దగ్గిరగా చూసాను.
ఎక్కించిన వాళ్లను చూసాను.
పైకి ఎగదోసి మరి ఎక్కించిన వారిని చూసాను.
చిటారు కొమ్మదాక ఎక్కిన వారిని చూసాను.

ఎక్కిన వారిని చూసాను.
ఎక్కి కళ్ళు మూసుకుని పోయి గుడ్డివాళ్ళైపోయిన వారిని చూసాను.
పైనుంచి క్రిందపడ్డ వారిని చూసాను.
దబ్బున పడ్డ వారిని చూసాను.
కాళ్ళు చేతులు విరిగిన వారిని చూశాను.
నడుములు పడిపోయి జీవితాంతం మంచాలకే బంది ఐపోయిన వాళ్ళని చూసాను.
పడిన వాళ్ళకి అసరాగా ఎవరూ నిలబడని పరిస్థితులని కూడా చూసాను.
వాళ్ళు ఒంటరిగా దుర్భరమైన జీవితాన్ని గడిపి కాల గర్భంలో కలిసిపోయిన వైనాన్ని గమనించాను.

మునగ చెట్టు

మునగ చెట్టు

ఇంకా చెప్పాలంటే మునగ చెట్టుకి మిగతా చెట్లకి ఉన్న తేడా కూడా తెలుసుకున్నాను.
దేవదారు వృక్షాలకి, మామిడి చెట్లకి, పూల పొదలకి,  గడ్డిపోచలకి మధ్య ఉన్న సారూప్యాలను కూడా తెలుసుకున్నాను.

పైవేవి నేను స్వయంగా అనుభవించి తెలుసుకోలేదు.
జీవితం నాకు నేర్పిన పాఠాలు అవి.
నేను మంచి విద్యార్ధిని అని నా నమ్మకం.

కరెంటు షాక్ కొడుతుందని ముట్టుకుని తెలుసుకోనఖర్లేదు.
నిప్పు ముట్టుకుంటే కాలుతుందని కూడ దానిని ముట్టుకుని తెలుసుకోన‌ఖర్లేదు.

అలాగే మునగ చెట్టు ఎక్కి కింద పడి అనుభవం పొందనఖర్లేని ఒక జీవితం నాకు దొరికింది.
అటువంటి జీవితం నాకు ప్రసాదించిన జ్ఞానం అది.
కాబట్టి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించవద్దు.
భంగ పడి మీరు అవమానాల ఊబి లో కూరుకుపోవద్దు.
చక్కగా మీ జీవితాన్ని,  హుందాగా, ఆత్మగౌరవంతోను,  ఆనందంగాను, సుఖసంతోషాలతో గడపండి.
దయచేసి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించొద్దు!
అది మీవల్ల కాదు కదా..మీమ్మల్ని పుట్టించిన ఆ బాబు వల్ల కూడా కాదు!!

5 thoughts on “మునగ చెట్టు

 1. Chala baavundi kavita ante Munaga chettu ekkinchaanani anoddandi sir.
  Mimmalni rani book centre lo enno saarlu maatlaadaamu 1989 lo. Maa aayana rajasekhar, ramana ane maa friend to shopki vachevaallam. Rajuto baagaa discussions pettukunevaru.
  Mimmalni kinege dwara telusukuntoone unnamu. Mee Amma garu maaku baaga telusu. Aavida ela unnaru?

  • రాధ గారు, మిమ్మల్ని ఇక్కడ ఇలా కలవడం సంతోషకరం. అమ్మ 96 లో గతించింది. మీ వారిని అడిగానని చెప్పండి. మీరు హైద్రాబాదులోనే ఉంటున్నట్టైతే వీలు చూసుకుని ఒకసారి కలుద్దాం. నా ఈమైల్ ఇదిగో: http://scr.im/theachievers

 2. Sir,
  అయ్యో సారీ సర్.
  మేము మద్రాసు వదిలి పూనా ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగాలు చేసి ఇప్పుడు 8 ఏళ్ళ క్రితం రిషీవ్యాలీ స్కూలికి చేరుకున్నాము.
  ఇక్కడ తెలుగు టీచర్స్ గా చేరాము. రాజశేఖర్ పిడూరి (మా వారు) రెండేళ్ళ క్రితం అనుకుంటా జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం ‘మీరు చదువుకుంటున్నది ఎందుకోసం’ అనువాదం చేశారు.
  విశాలాంధ్ర వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇక్కడకి వచ్చాక కూడా మిమ్మల్ని తలుచుకున్నాము. మద్రాస్ లో ఉండే విజయ్ గారిని కొడవటిగంటి కుటుంబరావు సినిమా వ్యాసాలు కోసం అడిగితే ఆయన మాకోసం మిమ్మల్ని అడిగారు.
  ఆ పుస్తకం దొరుకుతుందా సర్?
  మీరే ఎప్పుడైనా రిషీవ్యాలీకి రండి.
  మా ఫోన్ 9573626591
  ధన్యవాదములతో,
  రాధ మండువ
  p.s: మీ email నన్ను accept చేయడం లేదు. అందుకని ఇక్కడ రాశాను. ఏమీ అనుకోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *