ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్

మొన్న అంటే జూన్ 15 వ తారిఖున ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి (ABN Andhrajyothy) వారి దిక్సూచి ప్రోగ్రామ్ లో రెజ్యుమె గురించి ఒక అరగంట లైవ్ ప్రోగాం లో పాల్గొన్నాను.  ప్రోగ్రాం సాయత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య జరిగింది.

నేపధ్యం

గతంలో నేను ఆంధ్రజ్యోతిలో రెండు శీర్షికలు వ్రాసేవాడిని. అందులో ఒకటి కెరీర్ కార్నర్ (Career Corner).  ఇంకొకటి ఇ పదం.  ఆ అనుభవం  ఈ ప్రోగ్రాం కి బాగా దోహదపడింది.  ఆంధ్రజ్యోతి దినపత్రిక “దిక్సూచి” మితృడు కిరణ్ ఫోన్ చేసి రెజ్యుమె ల మీద ఒక ప్రోగ్రాం చేద్దాం సార్ అని అనగానే ఒప్పేసుకున్నాను.  కారణం నాకు తెలిసిన రెజ్యుమే గురించి తెలిసిన అంశాలు పదిమంది ఉద్యోగార్ధులకి తెలియజేయడం వల్ల వారికి ఒక చక్కని జీవనోపాధికలిగే అవకాశం కలుగుతుంది కదా అని.  చాలా మందికి రెజ్యుమ్ (resume)కి రెజ్యుమే (résumé)కి తేడా తెలియదు. అంతే కాక అవగాహానారాహిత్యం వల్ల ఇంకా చాలా తప్పులు చేస్తు, తమకు ఉద్యోగాలు రాకపోవడానికి అనేకి మైన ఇతర కారణాలను చూపిస్తుంటారు. వాటిలో కులం అని,  గోత్రం అని, మతం అని, ప్రాంతీయ దురభిమానమని, బంధు ప్రీతి అని అనేకనేకమైన ఇతర దురభిప్రాయలు కొన్ని. అసలు విషయం పక్క దారి పడుతుంది. టి వి ఒక చక్కని ప్రసార మాధ్యమం. దానిద్వారా నేను చెప్పాలనుకునేవి చెప్పడమే కాదు, లైవ్, ఫోన్-ఇన్ ప్రోగ్రాం కాబట్టి చూసే వారి అనుమానాలను కూడా నివృత్తి చేయవచ్చు అన్నది స్వాభిప్రాయం.

ప్రోగ్రామ్ తేది నిర్ణయం జరిగిన వెమ్మటే, మా  జాబ్స్‌హబ్ (JobsHub)వారి దగ్గిర కొన్ని రెజ్యుమేని సేకరించి వాటిలో కొన్నింటిని ఎన్నుకుని ఒక ‘ప్రెజెంటెషన్‌’ (presentation) ని తయారుచేసుకున్నాను.  ఆ ప్రెజంటేషన్ ని సి డి వ్రాసి ‘దిక్సూచి‌’ కి అందించాను. ప్రెజంటేషన్ కి సంబంధించిన కొన్ని నోట్స్ (notes) కూడా ప్రెపేర్ చేసుకున్నాను

నిర్ణీత సమయానికి ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి వారి వాహనంలో నే వారి స్టుడియోకి చేరుకున్నాను.  ఒక అరగంట ముందుగానే చేరుకోవల్సింది, ఒక పది నిముషాలుందనగా చేరుకున్నాను.  దిక్సూచి కిరణ్ నన్ను స్వాగతించి  తిన్నగా

ABN andhrajyothy Television

ABN ఆంధ్రజ్యోతి

మేకప్ రూమ్‌లోకి తీసుకు వెళ్ళారు.  అక్కడే ఆంకర్ పర్సన్ ‘చంద్రిక’ ని నాకు పరిచయం చేసారు.  చక్కగా నవ్వుతూ మెకప్ మెన్ కి నాకు టచప్ చెయ్యమని సూచిస్తూనే , రెజ్యుమె ల కి సంబంధించిన అంశాలతో తయారుచేసుకున్న ఒక ప్రశ్నాపత్రాన్ని అంద జేసింది.  నా కు మెకప్ మాన్ (makeup man) టచప్ చేస్తుండగానే ఆ  ప్రశ్నాపత్రాన్ని అక్కడే ఒక్కసారి చూసుకుని తిన్నగా స్టూడియో లోకి అడుగుపెట్టాను.  ఎత్తైన టేబుల్ (table), ఎత్తుగా ఉన్న స్టూల్ (stool). చిన్న మైక్రొఫోన్ ని (microphone),  కనీ కనపడని పద్ధతిలో నా షర్ట్ (shirt)కి అమర్చే లోపు, ఆడియో టెస్టింగ్ (audio testing) మొదలయ్యింది.  మా ముందు మూడు కెమరాలు .  వాటితో పాటు ఒక మానిటర్ .  అందులో స్క్రీన్ మీద మీ అందరికి కనపడే టి వి లో బొమ్మ.  వాటి వెనుక సిబ్బంది.  రెడి.

మానిటర్ లో కమర్షియల్స్ కనపడుతున్నవి.  నా ముందు నేను తెచ్చుకున్న నోట్స్ (notes) పెట్టుకున్నాను. ప్రేక్షకులని దిక్సూచి కి ఆహ్వానిస్తూ , నన్ను పరిచయం చేసింది చంద్రిక.  మొట్ట మొదటి ప్రశ్న సంధించింది, రెజ్యూమ్ ఎలా ఉండాలి? అని అంటూ.

రెజ్యుమ్ (resume) కి రెజ్యుమె (résumé) కి అర్ధం చెబుతూ కరికులం వైటె / సి.వి (Curriculum Vitae- c.v), బయొ డెట (bio-data) రెజ్యుమె ల మధ్య తేడాలని చెబుతూ ఆ నాటి నా ప్రోగ్రాం ని మొదలుపెట్టాను.  సుమారుగా పదిమంది కాలర్ లకు (caller) సందేహలకి జవాబులిచ్చాను.  ముంబై నుండి కూడా కాల్స్ వచ్చినవి అని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసింది.

స్థూలంగా నేను చెప్పిన విషయాలు ఇవి;

అతి ముఖ్యమైన విషయం: రెజ్యుమెతో ఉద్యోగం రాదు. రెజ్యుమె ఇంటర్యూకి అవకాశం కల్పిస్తుంది. అంతే.

ఎక్కడో, ఏదో D T P సెంటర్లోనో, ఇంటర్‌నెట్ సెంటర్లో‌నో అక్కడ ఉన్న రెజ్యుమె లో పేర్లు అడ్రస్ (address), ఎడ్యుకెషనల్ క్వాలిఫికెషన్స్ (educational qualifications) మార్చేసి ఒక మూస లో తయారైన రెజ్యుమె ని వాడొద్దు.  మీరు కోరుకుంటున్న ఉద్యోగానికి కావల్సిన అర్హతలకి, నైపుణ్యాలకి మీకున్న అర్హతలని, నైపుణ్యాలని అన్వయించి రెజ్యుమె తయారు చేసుకోండి.  అలా చేయ్యడం వల్ల మీకు ఇంటర్యూ (interview)కి కాల్ లెటర్ (call letter) వచ్చే అవకాశాలు పెరుగుతవి.

  • రెజ్యుమెలు ఆసాంతం చదివే టైమ్ అందరికి ఉండదు.
  • కాబట్టి మీ రెజ్యుమె రెండు పేజిలు (pages) మించకుండా చూసుకోండి.
  • రెజ్యుమే ఆకర్షణీయంగా ఉండాలని, ప్రత్యేకంగా కనపడాలని రంగులు వాడవద్దు.
  • అడగందే మీ ఫోటోలు జతపరచవద్దు.
  • తెల్లరంగు A4 కాగితం వాడండి.
  • Arial లేదా Times New Roman font 10 లేదా 12 point మాత్రమే వాడండి.

రెజ్యుమె లు రెండు రకాలు.  ఒకటి అనుభవం (experience) ఉన్నవారికి.  రెండు ఫ్రెషర్ కి (fresher) అనుభవం బొత్తిగా లేని వారికి.

పేరు (name)

రెజ్యుమెలో మొట్ట మొదట కనపడవలసింది మీ పేరు.  ఒకవేళ మీ పేరు చాల పొడుగ్గా ఉంటే (ఉదా:  వీర వెంకట శివ రామకృష్ణ హనుమంత రావు ) మీరు ఇష్టపడి మిగతావారందరు పిలిచే పొట్టి పేరునే వాడండి.  అందరు  మిమ్మల్ని హనుమంత రావు అని పిలుస్తున్నట్టయితే అదే పేరుని వాడడండి.  మీ మిగతా పేరుని పొడి అక్షరాలతో సూచించండి. ఉదా:  V.V.S.R. Hanumantha Rao.

ఇ మైల్ ఐడి (email id)

ఇమైల్ ఐడి (email id) చాలా ఇ మైల్ ఐడి లో కూడా మీ ప్రొఫెషన్ లేదా మీకున్న ప్రత్యేకమైన ప్రావిణ్యత ని సూచించవచ్చు.  ఉదాహరణ కు శంకర్ C ++ లో ప్రజ్ఞావంతుడు అనుకుందాం. అతను shankar.c++ అనో లేదా shankercplusplus అనో తయరు చేసుకోవచ్చు.   మెకానికల్ ఇంజనీర్ ఐతే (Mechanical engineer) engineershankar అనో పెట్టుకోవచ్చు.  దాదాశంకర్ (dada.sankar) అనే పేరులో దాదా అంతే బెంగాలి భాషలో సోదరుడు అన్న అర్ధం ఉంది. ‘దాదా’ అంటే చాలమందికి ‘రౌడి‌’ గుర్తు వస్తాడు. అదేదో ఆకతాయి తనంగా, చిన్న పిల్లల చేష్టలాగా ఉంటుంది.  సరి కొత్త ఈ మైల్ ఐడి ల కోసం ఈ సైట్‌లో తగిన పదాలని ఇస్తే మీకు కొన్ని కొత్త పేర్లను సూచిస్తుంది. ఇక్క డ క్లిక్ చేసి ప్రయత్నించండి. పూర్తిగా ఉచితం.

మొబైల్ నెంబర్ (mobile phone number)

చాలమంది విద్యార్ధి దశలో తమ మొబైల్ ఫోన్ (mobile phone)ని ప్రి పెయిడ్ (prepaid) గా ఉంచుకుంటారు.  ఒకొక్క సారి అకవుంట్ (account) బాలన్స్ (balance) లేక డెడ్ (dead) ఐపోతుంది.  కాబట్టి అలా డెడ్ కాకుండా చూసుకోవాలి.  డెడ్ ఐన ఫోన్ కి ‘ఇంటర్యూ‌’ కోసం చేసే కాల్స్ అందవు. మీ చేతులారా మీరు మీకు వచ్చిన అవకాశాన్ని పోగొటూకున్నవారవుతారు.

పేరు, ఈమైల్ ఐడి, మొబైల్ ఫోన్ నెంబరు – ముద్రించే కాగితం పై అంచుకి ఒక్క అంగుళం దిగువన మధ్యలో ఉండాలి. (అంటే page పై margin కి one inch కింద కి center చేసి టైప్ చెయ్యలి)

మిగతా వివరాలన్ని సబ్ హెడింగ్స్ (sub headings) ఎడమ (left) చేతివైపుకి ప్రింట్ చెయ్యలి.

ఆబ్జెక్ట్‌వ్ (objective)

అనుభవం లేని వారు ఇక్కడ తమ అబ్జెక్ట్‌వ్ (objective) ఆ ఉద్యోగం ద్వారా ఆ సంస్థకు మీరు ఏ విధంగా సమర్ధతని అందిద్దామనుకుంటున్నారో చెప్పాల్సివుంటుంది.

అనుభవం ఉన్నవారు ఇక్క డ సమ్మరి (summary) అంటే తమ ఉద్యోగ ప్రస్థానంలో ని అతి ముఖ్యమైన విజయాలను, సాధనలను తెలియచేయాలి.

ఎక్స్‌పీరియన్స్ (experience)

ఇక్కడ అనుభంఉన్నవారు తమకున్న అనుభవాన్ని, లేని వారు తమకున్న extracurricular లేదా co curricular activities లేదా తాము చేసిన ప్రాజెక్ట్ (project) వివరాలు వివరించాలి.  అనుభవం ఉన్నవారు తము ప్రస్తుతం ఏదేని ఉద్యోగంలో కాని వృత్తిలోకాని ఉంటే దానిని ముందు తెలియజేయాలి.  అనుభవం ఎక్కువ ఉన్నవారు లేదా ఉద్యోగాలు చాలా మారినవారు గతంలో తాము చేసిన మూడు ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేస్తే రెజ్యుమె నిడివి తగ్గించినందున, హెచ్ ఆర్ ఎక్జిక్యూటివ్ (HR = Human Resources executive) కి శ్రమ తగ్గించిన వారవుతారు.

అకడెమిక్స్ / ఎడ్యుకేషనల్ క్వాలిఫికెషన్స్ (Academic / Educational Qualifications)

ఇక్కడ మీ విద్యార్హతలు – కాలేజ్, స్కూల్ చదువుల గురించి చెప్పాలి.  ఇవి కాకుండా ఇంకేవైన ఇతర సాధనలుంటే వాటిని గురించి కూడా తెలియజేయాలి.

ఎడమ చేతివైపున మీ పూర్తి పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్‌ తో సహా ఇవ్వాలి.

దాని క్రింద తేది (date). తేది కి ఎదురుగుండా అదే లైన్‌లో కుడి చేతి వైపున మీ పూర్తి పేరు ఉండాలి.  మీ పేరు పైన మీ సంతకం ఉండాలి.

రెజ్యుమె తయారి గురించి మరిన్ని వివరాలు రానున్న రోజులలో సవివరంగా తెలియజేస్తాను.  ఈ లోపు మీకు ఏమైనా సందేహాలుంటే క్రింద వ్యాఖ్యల ద్వారా క్రింద తెలియజేయండి.

కృతజ్ఞతలు

ABN ANDHRAJYOTHY సంపాదక వర్గానికి, సాంకేతిక నిపుణులకి, ABN ANDHRAJYOTHY anchor మల్లిక గారికి, ‘దిక్సూచి’ కిరణ్ గారికి, జాబ్స్‌హబ్ అధినేత శ్రీహరి గారికి,  ‘ఆర్డెంట్’ web designer నారాయణ గారికి, జాబ్స్‌హబ్ సత్యనారాయణ కి తమ సహాయ సహకారాలను అందించినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

3 thoughts on “ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్

  1. Pingback: Tweets that mention ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్ | వేదిక -- Topsy.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.